Mukesh Ambani : సోమనాథుని ఆలయానికి ముఖేశ్ అంబానీ భారీ విరాళం..!! - Telugu News - Mic tv
mictv telugu

Mukesh Ambani : సోమనాథుని ఆలయానికి ముఖేశ్ అంబానీ భారీ విరాళం..!!

February 19, 2023

మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ..తన కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి గుజరాత్ లోని సోమనాథ్ ఆలయనాన్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన అంబానీ,ఆయన కుమారుడికి ఆలయ ట్రస్టు సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి అభిషేకం నిర్వహించారు. కాగా సోమనాథుడి ఆలయాన్ని దర్శించుకోవడంతోపాటు..ఆలయ ట్రస్టుకు ముఖేశ్ అంబానీ 1.5కోట్ల భారీ విరాళాన్ని అందించారు. మహాశివరాత్రి సందర్భంగా అంబానీ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ విరాళాన్ని అందించారు. అంతేకాదు గతంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్ానరు. అక్కడ కూడా రూ. 1.5కోట్ల విరాళాన్నిఅందజేశారు.