ఘనంగా ముఖేష్ అంబానీ చిన్న కొడుకుకు నిశ్చితార్థం… కోడలు బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్ అంబానీ-నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌కు ఘనంగా నిశ్చితార్థం జరిగింది. గురువారం ఉదయ్‌పూర్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జంటకు ఇప్పటికే వివాహం నిశ్చయమవ్వగా నేడు ఒకరి చేతికి మరొకరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇరు కుటంబాలకు చెందిన సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.
రాధికా మర్చంట్ ఎవరూ ?
అపర కుబేరుడైనా అంబానీ ఇంటికి వచ్చే కోడలు ఎవరు ? ఆమె బ్యాగ్రౌండ్‌పై సెర్చింగ్ మొదలైంది. రాధికా మర్చంట్ కోసం తెలుసుకోవడానికి విపరీతంగా ఇంటర్ నెట్‌లో వెతుకుతున్నారు. అయితే రాధికా మర్చెంట్ ఎవరో కాదు. అనంత్ అంబానీకి చిన్ననాటి స్నేహితురాలు. దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ విరెన్ మర్చంట్ కుమార్తెనే రాధికా మర్చెంట్. ఆమె తల్లి పేరు శైలా మర్చెంట్ కాగా రాధిక చెల్లెలు అంజలి మర్చంట్. రాధికా న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఎన్‌కోర్ హెల్త్ కేర్ బోర్డు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు శాస్త్రీయ నృత్యం అంటే చాలా మక్కువ. ఈ ఇష్టంతోనే భరతనాట్యంలో శిక్షణ పూర్తి చేసుకుంది. జూన్ 5న దేశంలోని పలువురి ప్రముఖులు ముందు ప్రదర్శన ఇచ్చి రాధికా మర్చెంట్ ఆకట్టుకుంది.