ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ రెండో కొడుకు అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాబోయే భార్య రాధికా మర్చంట్‌తో కలసి గురువారం ఆయన ఆలయానికి వచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలో రాధికతో కలసి స్వామిని దర్శించుకున్నారు. వీరికి అర్చకులు రంగనాయక మండపంలో శ్రీవారి ప్రసాదాలు, ఆశీర్వాదాలు అందజేశారు. వీరి నిశ్చితార్థం డిసెంబర్ 29న ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. అంబానీలు వెంకన్నకు అపర భక్తులు కావడంతో ఏ శుభకార్యానికి ముందైనా తిరుమలకు రావడం, భూరి కానుకలు సమర్పించుకోవడం ఆనవాయితీ. రాధికా మర్చంట్ కూడా గుజరాత్‌కు చెందిన ప్రముఖ వాణిజ్య కుటుంబం వారసురాలే. ఆయన తండ్రి ఎంకోర్ హెల్త్¡కేర్ కంపెనీ సీఈవో.
Anant Ambani, the younger son of Reliance Industries chairman Mukesh Ambani along with fiancé Radhika Merchant offered prayers at the hill shrine of Lord Venkateswara atop Tirumala Hills in Tirupati. #AndhraPradesh pic.twitter.com/q4CIMs0I8p
— Ashish (@KP_Aashish) January 26, 2023