ఆడవాళ్లు హజ్‌కు ఒంటరిగా వెళ్తే చెడిపోతారు

ముస్లిం మహిళలు ఒంటరిగా హజ్ యాత్రకు వెళ్తే చెడిపోతారని ఓ ముస్లిం మత పెద్ద చెప్పుకొచ్చాడు.  మహిళలు ఒంటరిగా ఈ యాత్రకు వెళ్లొద్దని చెప్పాడు. 45 ఏళ్ల దాటిన మహిళలను మగతోడు లేకుండా హజ్ యాత్రకు అనుమతించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై జామాతే ఉలేమా కార్యదర్శి ఆలా హజరత్ దర్గా మతపెద్ద ముఫ్తీ మొహమ్మద్ సలీం సూరి తీవ్రంగా స్పందించారు. ‘మహిళలు వారి భర్తలతోనో, లేకపోతే రక్తసంబంధమున్న మగవాళ్లతోనే హజ్ యాత్రకు వెళ్లాలి. వారు ఒంటరిగా వెళ్తే పాపాలు చేసి చెడిపోతారు. వాళ్లను పాడు చేసేందుకే ప్రభుత్వం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. షరియా ప్రకారం మహిళ ఒంటరిగా వెళ్ల కూడదు’ అని అన్నారు. మహిళలు పురుషులతో ఎన్నటికీ సమానం కారని కూడా అన్నారు. ‘సమానత్వం కావాలా? అయితే మగవాళ్లు నాలుగున్నర నెలలు, ఆడవాళ్లు నాలుగున్నర నెలలు గర్భాన్ని మోయాలి కదా’ అని ఎద్దేవా చేశారు. ఆడవాళ్లే గర్భం దాల్చడం ఆడవాళ్ల పని అని, వారు మగవాళ్లతో సమానం కాలేరని అన్నారు.

SHARE