మూలుగుబొక్క-2 ఆమె బంగారం.. వచ్చేసింది (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

మూలుగుబొక్క-2 ఆమె బంగారం.. వచ్చేసింది (వీడియో)

June 2, 2019

బగారా అన్నం, మటన్ కూర అందులో మూలుగు బొక్క వస్తే ఆ మజా ఇంకా వేరేలా వుంటుంది. భార్యాభర్తలు బగారన్నం, మటన్ కూర వండుకుని కలిసి పంచుకుని తింటే ఆ మజా ఇంకో లెవల్లో వుంటుంది. ఆ అనుబంధాన్ని ‘మూలుగు బొక్క’ షార్ట్ ఫిల్మ్‌లో చూపించాం. అందరూ చాలా బాగా ఆదరించారు. తెలంగాణ ఆలుమగలను చూపించారని, రెండవ పార్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది కామెంట్లలో అడిగారు. ఆదరించిన అందరికీ మైక్ టీవీ ధన్యవాదాలు తెలుపుతోంది. వారందరి కోరిక మేరకు ‘మూలుగు బొక్క-2.. ఆమె బంగారం’ను తీసుకువచ్చాం. ఈ పార్టును కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

భార్యాభర్తల అనుబంధం కలిసి పంచుకునే ప్రేమ దగ్గర, కలిసి తినేచోట ఇంకాస్త బలపడుతుందని చెప్పే ప్రయత్నం చేశాం. యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పనిచేసే భర్తకు అర్జంటుగా కొంత డబ్బు అవసరం వుంటుంది. అంత డబ్బు తనదగ్గర లేదు. పోనీ ప్రెండ్స్‌ను అడుగుదామంటే ఎవరి బాధ్యతల్లో వాళ్లు భారంగా వున్నారని అడగడు. భార్య నగలు ఇమ్మంటే తాను ఇవ్వనంటుంది. తర్వాత భర్త బాధపడటం చూసి ఇస్తుంది. ఆ బంగారాన్ని కుదువపెట్టి వచ్చిన డబ్బులతో యాడ్ కంప్లీట్ చేస్తాడు భర్త. తర్వాత ఆమె నగలు ఆమెకు తెచ్చి ఇస్తాడు. ఓ ఉంగరాన్ని కూడా బహుమతిగా ఇస్తాడు. కష్టసుఖాల్లో భార్యాభర్తలు పాలు పంచుకోవాలని చెప్పే ప్రయత్నం చేశాం. వీరాస్వామి కర్రె దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తిరుపతి సినీమటోగ్రఫీ అందించారు. ఉదయ్ కుంభం కూర్పు అందించారు. కిందిలింకులో మూలుగు బొక్క-2 ను చూడొచ్చు.