సినీ నటి, బిగ్‌బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ ముమైత్ ఖాన్‌పై ఓ క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన డబ్బులు ఎగ్గొట్టిందని రాజు అనే డ్రైవర్ ఆరోపించాడు. తన క్యాబ్‌లో గోవా టూర్ వెళ్లొచ్చిన ముమైత్ రూ.15 వేల వరకు బాకీ పడిందని మీడియా ముందు చెప్పాడు. ఆ మొత్తం తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తంచేశాడు.
మూడు రోజులు గోవాకు కారు బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్.. ఆ తర్వాత టూర్‌ని ఎనిమిది రోజులకు పొడిగించిందని రాజు చెప్పాడు. టోల్ చార్జీలకు, డ్రైవర్ బత్తాలు, తిండి ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని వాపోయాడు. ఏ డ్రైవర్‌కు ఇలా జరగకూడదని.. ఈ ఘటనపై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌తో చర్చించాక పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించాడు.