బిగ్ బాస్ హౌస్ లో ముమైత్ ఖాన్...డ్రగ్స్ కేసు విచారణ ఎలా? - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్ హౌస్ లో ముమైత్ ఖాన్…డ్రగ్స్ కేసు విచారణ ఎలా?

July 18, 2017

డ్రగ్స్ కేసుల  ఆరోపనలు ఎదుర్కుంటున్న  పలువురు సినీ ప్రముఖులకు ఎక్సైజ్,ఎన్ ఫోర్స్ మెంట్  ఉన్నతాధికారులు ఇప్పటికే నోటిసులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే,అయితే ఇప్పుడు శుర్వైంది అస్సలు సినిమా..ఒక్కొక్కలు మేం జెప్పిన డేట్ నాడు విచారణకు రావల్సిందని కబురు వంపిన్రట సిట్ అధికారులు.అయితే మొట్ట మొదలు డైరెక్టర్ పూరిజగన్నాథ్ ను ఈనెల 19 నాడు విచారిస్తరట,20 ఛార్మి ,21న ముమైత్‌ఖాన్‌, 22న సుబ్బరాజు, 23న శ్యాం కె.నాయుడు, 24న రవితేజ, 25న ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, 26న నవదీప్‌, 27న తరుణ్‌, 28న నందు, 29న తనీష్‌ను ఎక్సైజ్ శాఖా కార్యాలయంల విచారిస్తరట.

మరి ముమైత్ ఖాన్ విచారణకు ఎలా..?

డ్రగ్స్ కేసు విషయంల నోటీసులందుకున్న  ముమైత్ ఖాన్ ఇప్పుడు పూణేలోని బిగ్ బాస్ హౌస్ ల ఉంది,మరి 21 నాడు  విచారణకు ఎలా హాజరవుతుంది?,70 రోజులు బయటి ప్రపంచంతో సంబంధంలేకుండా ఆడనే ఉండాలే…మరి బిగ్ బాసు ఈ విచారణ డేటు వార్తను ముమైత్ ఖాన్ కు  అందిస్తడా,ఒకవేళ అందించినా ఈ విషయాన్ని ముమైత్ లైట్ తీస్కుంటుందా? లేకపోతే  ఉన్నకేసుతోనే తల్కాయ నొప్పి..మల్ల హాజరు కాకపోతే అదో కేసని  బిగ్ బాస్ నుంచి బైటికచ్చి  విచారణకు హాజరవుతుందా ?పోలీసులే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి ముమైత్ ఖాన్ మీద  యాక్షన్ తీస్కుంటారా ?ఏమో సూడాలె మరి ఏం జరుగుతుందో?.