నా కేరక్టర్ అందరికీ తెలుసు, రాజే వేధించాడు.. ముమైత్  - MicTv.in - Telugu News
mictv telugu

నా కేరక్టర్ అందరికీ తెలుసు, రాజే వేధించాడు.. ముమైత్ 

October 1, 2020

Mumaith khan on driver controversy .

డ్రైవర్లకు డబ్బులు ఎగ్గొట్టడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించినట్లు తనపై వచ్చిన ఆరోపణలపై నటి, నర్తకి ముబైత్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. అవన్నీ వట్టి అబద్ధాలని, తన కేరక్టర్ ఏంటో అందరికీ తెలుసని ఆమె చెప్పారు. ముమైత్ గోవా ట్రిప్ కోసం తన కారును బుక్ చేసుకుని రూ. 15 వేలు చెల్లించకుండా ఎగ్గొట్టిందని, టోల్ ఫీజుగా తనే కట్టానని రాజు అనే క్యాబ్ డ్రైవర్ ఇటీవల పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. తమకు కూడా ఆమె డబ్బులు ఇవ్వకుండా సతాయించిందని మరికొందరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ముమైత్ మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. అంతకు ముందు ఆమె పంజగుట్ట పోలీస్ స్టేషన్‌ అధికారులను కలిశారు. రాజుకు తాను రూ.23,500 చెల్లించానని, అతడే తనను వేధించాడని ప్రత్యారోపణలు చేశారు. 

‘నాపై ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలు. క్యాబ్ డ్రైవర్‌ను మోసం చేయాల్సిన ఖర్మ నాకేం పట్టింది? నేను పక్కా ప్రొఫెషనల్ ఆర్టిస్టును. పన్నెండేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా క్యారెక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుసు.. మీడియా కూడా వాస్తవాలు తెలుసుకోకుండా రూమర్లు ప్రచారం చేయడం సరికాదు. నాపై బురదజల్లడానికి మీకు హక్కు ఎక్కడుంది?’ అని విరుచుకుపడింది.