బిగ్ బాస్... దిస్ ఈజ్ టూ మచ్...... - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్ బాస్… దిస్ ఈజ్ టూ మచ్……

August 21, 2017

బిగ్ బాస్ షో నుండి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యారు. పోతూ పోతూ శివబాలాజీకి పెద్ద టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ సూచన ప్రకారం ఇక నుండి శివబాలాజీ మాటకు ముందు ముమ్ము ముమ్ము అని ఐదు సార్లు అని తర్వాతే చెప్పాల్సిన విషయం చెప్పాలనే నిబంధన పెట్టాడు.  హౌజ్ లో బోన్లో నిలబెట్టి మాట్లాడించిన తీరు బాగానే ఉంది. అయితే  బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వారి మధ్య బంధాలు, అనుబంధాలు, వారి వ్యక్తిత్వాల గురించి చెప్పిన తీరూ బాగానే ఉంది. కాకాపోతే ఇస్తున్న టాస్క్ లే కాస్త ఎబ్బెట్టుగా ఉంటున్నాయి.

ఇండ్లల్లున్న జనాలు పిల్లలతోసహా కార్యక్రమాన్ని  చూస్తున్నారు. ఆడవాళ్ల విషయంలో మినిమమ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు.రచన తన వీపుల మీద ధన్ రాజ్ ను మోయాలని బిగ్ బాస్ చెప్పాడు.  షోలో ఇట్లా చేయడం  మీకు ఒకే కావొచ్చు. కాక పోతే  ఆడవాళ్లకు ఆట్లాంటి టాస్క్ ఇవ్వడం  ఏమిటనేదే ప్రశ్న. చిత్రవిచిత్రమైన టాస్క్ లు ఇస్తున్నారు. ఇందులోనూ కొన్ని ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. ఈ విషయంలో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

హౌజ్ లో నుండి వారానికొకరు చొప్పును ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటికి ఐదు వారాల పూర్తి అయింది. ఇన్ని రోజుల  కాలంలో షో జనంలో బాగా వెళ్లింది. జనాలనూ ఎంటర్ టైన్ చేసింది. కాకా పోతే అందులో ఇస్తున్న టాస్క్ లు మాత్రం మరీ టూ మచ్ గా ఉంటున్నాయి. ఫన్నీ బెడిసి కొడితే షో కు పెద్ద షాక్ తప్పదు మరి.  తారక్  అద్భతంగా హోస్ట్ చేస్తున్నారు.  అమీర్ పేట్ లో అర్చన  ఫోటో పెట్టి ఆమె గెల్వాలని అభిమానులు కోరుకుంటున్నట్లు చెప్పి ఆటపట్టించారు.

నవదీప్ ఇంట్లో  రద్దైన పెద్దనోట్లు దొర్కినట్లు తారక్ చెప్పి నవదీప్ కు దడ పుట్టించారు. ఓవరాల్ గా షోన్ తారక్ రక్తి కట్టించారు.ఇంట్లున్న వారు మునుపటి కంటే వారి వారి లోపాలు,   మెరిట్లు అన్నీ చెప్పకుంటున్నారు. ఇంకా అందులో ఉన్న వారు నటిస్తున్నారనే విషయం మాత్రం  షోలో పాల్గొంటున్నవారే చెప్తున్నారు.