అందరిని ఎడ్పించి నవ్వుకుంటు బయటకు పోయింది - MicTv.in - Telugu News
mictv telugu

అందరిని ఎడ్పించి నవ్వుకుంటు బయటకు పోయింది

July 27, 2017

బిగ్ బాస్ షో నుండి ముమైత్ ఖాన్ అవుట్ అని ప్రకటించగానే ఆమె స్పందన అందరు ఉహించినదానికి బిన్నంగా ఉంది. నవ్వుతూ, తుల్లుతు, ఎదో హింది పాట లోలోపట పాడుకుండు, దుంకుకుంట సహచరుల దగ్గరకు వచ్చి నేను పోతున్ననని చెప్పి  అందరిని షాక్ లోకి తీసుకెళ్లింది. ఆమె మాట వినగానే అందరు పరేషన్. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అమే తన బ్యాగ్ ప్యాక్ చేసుకుంది. ఇంతలో పెద్ద డ్రామా. ఎడుపులు తూడుపులు, ఓదార్పులు. బోరుమని ఎడ్చిచిన ధన్ రాజ్,కత్తి కార్తీక ఇలా ఒక్కరి వెంట ఒక్కరు ఎడుపులు పొడబొబ్బలు… మిగితా వాళ్లు లోలోపట కుమిలిపోయారు. ముమైత్ మాత్రం అందరికి మంచిగ టాటా బైబై లు చెప్పి బయటకు వచ్చేసింది. అయితే ఎందుకు బయటకు పొతుందో మాత్రం సహచరులకు చెప్పకుండానే బయటకు వచ్చేసింది. అందరిని ఎడ్పించిన ముమైత్ ఖాన్ తను మాత్రం ఎడ్వకుండ, నవ్వుకుంటు వెళ్లిపోయింది. పోతూ పోతూ అల్ ద బెస్ట్, ప్లే వెల్ అంటు హౌస్ నుండి నిష్క్రమించింది…

ఇంతకి బిగ్ బాస్ ముమైత్ కు ఏమని చెప్పి వెళ్లిపొమన్నాడు.

చట్టపరమైన కారణాల రిత్య ముమైత్ షోలో కోనసాగడం కష్టమని బిగ్ బాస్ తేల్చడంతో  అమె తన సంచి సర్దుకుంది. వచ్చిరాని తెలుగు, సగం హింది, సగం ఇంగ్లీష్ తో షో లో సందడి చేసిన  ముమైత్ బయటకు పోవాలని బిగ్ బాస్ ప్రకటించడం అందరు ఉహించిందే . అయితే అమె ఎక్జిట్ ఎలా ఉంటుందో అని చాలా మంది ఎదురు చూశారు. డ్రగ్స్ కేసులో ఆమె బయటకు వచ్చిందనే విషయం అందరికి తెలుసు.

ముమైత్ ఖాన్ ను బయటకు పంపిన బిగ్ బాస్… తర్వత టీం కు శివగామి అండ్ కో అనే టాస్క్ ను ఇచ్చారు.