ఛార్మీ బాటలో ముమైత్ ! - MicTv.in - Telugu News
mictv telugu

ఛార్మీ బాటలో ముమైత్ !

July 27, 2017

ఛార్మీలా ముమైత్ కూడా తన బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్ళు ఇవ్వటానికి నిరాకరిస్తుందా ? ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ప్రశ్నలే ?? వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఛార్మీ బాటలో ముమైత్ నడవడం ఖాయమని తెలుస్తోంది. ఛార్మీని డైరెక్ట్ చేసిన వ్యక్తులే ముమైత్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నట్టు సమాచారం.
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ముమైత్ ఖాన్ సిట్ విచారణకు హాజరైంది. బిగ్ బాస్ షో నుండి బయటికొచ్చిన ముమైత్ పూణె నుండి హైదరాబాద్ నాంపల్లి సిట్ కార్యాలయానికి విచారణకు వచ్చింది. డ్రగ్స్ అలవాటు ఎప్పట్నించి వుంది ? పూరీతో మీకు డ్రగ్స్ వ్యవహారంలో ఎలాంటి సంబంధాలున్నాయి ? డ్రగ్స్ వాడాకాన్ని మీరు సమర్థిస్తారా ? పబ్బులకు, క్లబ్బులకు వెళ్ళే అలవాటుందా ? సినిమా రంగంలో డ్రగ్స్ అనేది కామన్ అనే మాటను సమర్థిస్తారా ? వంటి ప్రశ్నలు వేస్తారట. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం వుంది.