నన్ను దీపావళి చేసుకోనివ్వలేదు.. మోదీకి హిందీ నటుడు ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను దీపావళి చేసుకోనివ్వలేదు.. మోదీకి హిందీ నటుడు ట్వీట్

October 28, 2019

తన ఇంటి ముందు దీపావళి వేడుకలను ఓ ముస్లిం కుటుంబం అడ్డుకుందని హిందీ బుల్లితెర నటుడు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తన వేడుకలకు ఇబ్బంది కలిగించి పాడు చేశారని విశ్వభాను అనే నటుడు ఆరోపిస్తూ.. ప్రధాని మోదీకి ట్వీట్‌ను ట్యాగ్ చేశాడు. ఇంటి ముందు దీపాలు పెట్టనివ్వలేదని, తనకు జరిగిన అసౌకర్యాన్ని గుర్తించాలంటూ పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఓ నటుడు ఇలాంటి పోస్టు చేయడంతో ఇప్పుడదని చర్చానీయాంశంగా మారింది.

మాల్వానీ సొసైటీలో ఉంటున్న విశ్వభాను దీపావళి వేడుకలు చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో అతని ఇంటి ఎదురుగా ఉంటున్న ముస్లిం కుటుంబం వచ్చిన తన ఇంటికి కట్టిన తోరణాలు తెంపివేసి రభస సృష్టించారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తలుపులు మూసివేసి బయటకు రాకుండా చేశారని పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా తన వీధిలో ముస్లిం సొసైటీ ఇలాగే దీపావళి వేడుకలు చేసుకునేందుకు వీలు లేదని అడ్డుకున్నారని అన్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా అడ్డుపడటంతో ఏకంగా తన సమస్యను వివరిస్తూ ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఈ విషయం చర్చానీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.