11 మంది భారత జవాన్లకు కరోనా.. ఎయిర్‌పోర్టులో కలకలం - MicTv.in - Telugu News
mictv telugu

11 మంది భారత జవాన్లకు కరోనా.. ఎయిర్‌పోర్టులో కలకలం

April 4, 2020

Mumbai Airport CISF Jawan Corona Positive  

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఎవరికి ఎలా ఈ వ్యాధి సోకుతుందో అంతు చిక్కడం లేదు. ఇప్పటి వరకూ విదేశాలకు వెళ్లి వచ్చిన వారు, మర్కజ్ మసీదులో ప్రార్థనలకు వెళ్లిన వారికి ఈ వ్యధి సోకగా, తాజాగా సీఐఎస్ఎఫ్ సిబ్బందికి కూడా ఈ లక్షణాలు బయటపడ్డాయి ముంబైలోని చత్రపతి శివాజీ మహరాజ్ ఎయిర్ పోర్టులో పని చేసే 11 మంది జవాన్లకు ఈ వ్యాధి సోకింది. డ్యూటీలో ఉన్న జవాన్లకు ఈ లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. వెంటనే వారిని ఐసోలేషన్‌లో చేర్పించారు. ఎయిర్ పోర్టులో శానిటైజేషన్ చేశారు. 

విమానాల రాకపోకలపై నిషేధం విధించక ముందు ముంబై ఎయిర్ పోర్టుకు వివిధ దేశాల నుంచి భారీగా ప్రయాణికులు రాకపోకలు జరిపారు. అదే  సమయంలో డ్యూటీలో ఉన్న జవాన్లు వారిని తనిఖీలు చేయడం, భద్రత చర్యలు చూడటం లాంటివి చేశారు. అలా కరోనా లక్షణాలు ఉన్నవారిని కూడా తెలియకుండా తనిఖీలు చేయడంతో ఆ వ్యాధి జవాన్లకు కూడా సోకింది. ముందు జాగ్రత్త చర్యగా వీరితో పాటు డ్యూటీలో ఉన్న 142 మంది జవాన్లను క్వారంటైన్‌కు పంపించారు.ప్రయాణికుల ఐడీ కార్డులను తాకడం, వారు ముట్టుకున్న వస్తువులను తాకడం వల్ల ఈ వైరస్ అంటుకొని ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.  తాజా ఘటనలతో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడం మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు.