ఎయిర్ ఇండియా ఫ్లైట్‌కు తృటిలో తప్పిన ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

May 20, 2022

ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం… గాల్లోకి ఎగిరిన నిముషాల వ్యవధిలోనే ఇంజన్ ఆగిపోయింది. ఈ ఘటన ముంబయి విమానాశ్రయంలో గురువారం చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన 27 నిమిషాల తర్వాత సాంకేతిక లోపంతో ఓ ఇంజిన్ ఆగిపోవడంతో పైలట్ దానిని వెనక్కు మళ్లించారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

టాటా గ్రూప్‌కు చెందిన ముంబయి-బెంగళూరు ఎయిర్‌బస్ A320 శుక్రవారం ఉదయం 9:43కి ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో బయలుదేరింది. విమానం టేక్ ఆఫ్ అయిన 20 నిముషాల్లోనే సాంకేతిక సమస్య కారణంగా ఒక ఇంజిన్ పూర్తిగా ఆగిపోయింది. ఇది గమనించిన పైలట్లు, వెంటనే విమానాన్ని తిరిగి ముంబై ఎయిర్ పోర్టుకు మళ్లిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో కొంత భయాందోళనకు గురైన ప్రయాణికులు..విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను మరొక విమానంలో గమ్యస్థానానికి చేర్చినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.