ట్రాఫిక్ పోలీసు చెంప ఛెల్లుమంది... - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాఫిక్ పోలీసు చెంప ఛెల్లుమంది…

August 11, 2017

ట్రాఫిక్ ను నియంత్రించే బాధ్యత ట్రాఫిక్ పోలీసులది. తన బాధ్యతను నిర్వర్తిహిస్తున్న ట్రాఫిక్ పోలీసు పై ఓ వాహనదారుడు చేయి చేసుకున్నాడు. పోలీసు చెంపను ఛెల్లుమనిపించాడు. ముంబాయి లోని వసాయి వద్ద ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో కలసి మోటార్ వాహనం పై వెళ్తున్నాడు. అయితే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆ వాహనదారుడు సిగ్నల్ జంప్ చే శాడు. దానితో ట్రాఫిక్ పోలీసు ఆ వాహనదారుడిని ఆపాడు. కోపంతో వచ్చి వాహనదారుడు, ట్రాఫిక్ పోలీసు చెంప పై రెండుసార్లు కొట్టాడు. వాహనదారుడి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆగస్టు 7 జరగగా , ఈ రోజు వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.