యూట్యూబ్‌ పిచ్చి భార్య.. గొంతు పిసికి చంపేసిన భర్త..   - MicTv.in - Telugu News
mictv telugu

యూట్యూబ్‌ పిచ్చి భార్య.. గొంతు పిసికి చంపేసిన భర్త..  

April 11, 2019

ముంబైలో దారుణం జరిగింది. రాత్రంతా సినిమాలు చూస్తున్న ఓ భార్యను భర్త హతమార్చాడు. మహారాష్ట్రలోని అంధేరిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. చేతన్ చౌఘులే అనే వ్యక్తి భార్య ఆర్తి, రెండేళ్ల కొడుకుతో కలిసి అధేరిలో నివసిస్తున్నాడు. ఆర్తికి సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం కాస్తా వ్యసనంలా మారింది. దీంతో టీవీల్లో, ఫొన్లలో తరచూ సినిమాలు చూస్తుండేది. ఈ విషయమై చేతన్, ఆర్తిల మధ్య చాలా సార్లు గొడవలు జరుగుతుండేవి. అలా గొడవ జరిగినప్పుడల్లా ఆర్తి బాబుని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోతుండేది. మళ్లీ చేతన్ వెళ్లి భార్యను తీసుకుని వస్తుండేవాడు.

Mumbai Crime Man strangles wife to death for watching movies all night, surrenders later

కాగా రెండు రోజుల క్రితం ఆర్తి సరుకురు తీసుకొచ్చేందుకు భర్త చేతను డబ్బులు అడిగింది. చేతన్ ఇవ్వలేదు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. అప్పటి నుంచి ఆర్తి భర్తతో మాట్లాడట్లేదు. బుధవారం రాత్రి భర్తను పట్టించుకోకుండా రాత్రంతా యూట్యూబ్ లో సినిమాలు చూస్తూ కూర్చుంది. ఆ సౌండ్‌కు చేతన్‌కు నిద్ర పట్టలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చేతన్ తెల్లవారు జామున 4గంటలకు ఆర్తి గొంతు నులిమి చంపి, ఉదయం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. రోజు తనను నిద్రపోనివ్వకుండా భార్య సినిమాలు చూస్తుందని, చాలా రోజులు ఓపిక పట్టానని, బుధవారం రాత్రి సహనం కోల్పోయి భార్యను చంపేశానని పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.