కరోనా పేరు వింటనే జనం ఆమడదూరం పరిగెడుతున్నారు. కానీ కళ్లనిండా కామం కమ్ముకున్న వారు మాత్రం ఎవరు చేతికి చిక్కితే వారిని కాటేస్తున్నారు. కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చేరి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న వ్యక్తిపై డాక్టర్ అత్యాచారం చేశాడు. అది కూడా కొత్తగా ఉద్యోగంలోకి చేరిన రెండో రోజే నీచానికి పాల్పడ్డాడు. ముంబైలోని ప్రఖ్యాత వోకార్డ్ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది.
నవీ ముంబై మెడికల్ కాలేజ్‌లో చదివిన డాక్టర్ (33) గత నెలాఖార్న ఆస్పత్రో చేరాడు. కరోనాతో బాధపడుతున్న 44 ఏళ్ల పురుషుడికివైద్యం అందించే సాకుతో ఐసీయూలోకి వెళ్లాడు. ఎవరూ లేని సమయంలో అతనిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. పేషంట్ అలారమ్ మోగించి డాక్టర్ నిర్వాకాన్ని బయటిపెట్టాడు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో డాక్టర్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతణ్ని థానేలోని అతని ఇంట్లోనే హోం క్వారంటైన్ చేశారు. వోకార్డ్ ఆస్పత్రిలో ఇప్పటికే డాక్టర్లు, నర్సులు కలిపి 80 మందికి కరోనా సోకింది. దీంతో నెలరోజులు బంద్ చేసి గత నెల 23న తెరిచారు.