నీలినక్కలు కాదు నీలి కుక్కలు.. - MicTv.in - Telugu News
mictv telugu

నీలినక్కలు కాదు నీలి కుక్కలు..

August 18, 2017

నీలి నక్క కథ మీకు తెలిసే ఉంటుంది. నీలి మందులో పడిన ఓ నక్క.. తనకు వనదేవత వరంతో ఆ రంగు వచ్చిందని చెబుతుందా కథలో. తాను గొప్పదాన్నని, తనకు మిగతా నక్కలు తిండిపెట్టి పోషించాలని అంటుంది. విసిగెత్తిన నక్కలు దాని బండారం బయటపెట్టడానికి ఊలలు వేస్తాయి. నక్క లక్షణాలు పోని నీలి నక్క తను కూడా ఊల వేస్తుంది. ఇది తమలాంటి మామూలు నక్కేనని తెలుసుకుని చంపేస్తాయి మిగతా నక్కలు..

ఇప్పుడిదంతా ఎందుకంటే.. ముంబైలో నీలి కుక్కలు కనిపిస్తున్నాయి కాబట్టి. ఇటీవల కాలుష్యమయమైన  కాలువలో తిరిగిన కుక్కలు నీలిరంగులోకి మారిపోయాయి. ఓ తెల్లకుక్క అయితే పూర్తిగా నీలిరంగు అవతారమెత్తింది. రంగుల కుక్కలు వీధుల్లో తిరుగుతోంటే జనం వింతగా ఎగబడి చూస్తున్నారు. నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న జల కాలుష్యం, వాయు కాలుష్యం ప్రభావం జంతువులపై కనిపిస్తోంది. ముఖ్యంగా రసాయన పరిశ్రమలు నదుల్లో, కాలువల్లో వదులుతున్న ప్రమాదకర కాలుష్యాలు జీవరాశుల ప్రాణాలను తోడేస్తున్నాయి.