ముంబై కాదు.. ముంపు వరద - MicTv.in - Telugu News
mictv telugu

ముంబై కాదు.. ముంపు వరద

August 29, 2017

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని వరదలు ముంచెత్తాయి. మంగళవారం వేకువ జామునుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. మరో రెండు రోజులపాటు వర్ష బీభత్సం కొనసాగుతుందని వాతావారణ శాఖ అధికారులు చెప్పారు. లోనావాలోని వాల్వన్ చెరువు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది.

ములుంద్, సియోన్, ఖర్ జయ్ భారత్, హింద్ మాతా జంయ్షన్, గాంధీ మార్కెట్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నారు. కొలాబాలో గత 24 గంటల్లో 151 మిల్లీమీటర్ల వర్షపాతం, శాంతాక్రజ్ లో 88.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.