Mumbai: Homemaker fails to repay loan, morphed photo sent to contacts
mictv telugu

రూ.3000 చెల్లించలేదని.. మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసి..

June 7, 2022

Mumbai: Homemaker fails to repay loan, morphed photo sent to contacts

తీసుకున్న లోన్ చెల్లించలేదని, ఓ మహిళను ఈ-యాప్‌లో లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన తాజాగా ముంబయిలో వెలుగులోకి వచ్చింది. మార్ఫ్‌డ్ చేసిన ఆమె నగ్న చిత్రాల్ని ఆమె కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న వారికి పంపించింది. ముంబైలోని శివాజీనగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబయికి చెందిన ఓ 22 ఏళ్ల మహిళ.. రూ.3,000 తిరిగి చెల్లించలేదని ఆన్‌లైన్ యాప్ ఒకటి మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆమె కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న వారికి పంపింది. మొత్తంగా 14 మంది వేర్వేరు వ్యక్తులకు ఈ ఫొటోలను పంపడం గమనార్హం. దీంతో బాధితురాలు శివాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యాప్ యాజమాన్యంపై ఐటీ చట్టంలోని సెక్షన్ 504, సెక్షన్ 507, సెక్షన్ 67ఏల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

‘‘మే 25న యూట్యూబ్‌లో ‘క్రెడిట్ లోన్’ అనే ప్రకటన చూసి నా ఈ-మెయిల్‌తో లాగిన్ అయ్యాను.. అనంతరం నా సెల్ఫీ ఫొటో, ఆధార్, పాన్ వివరాలను అందులో నమోదు చేశాను. ఆ వెంటనే నా కాంటాక్ట్ పర్మిషన్ తీసుకున్నారు. నేను రూ.5,000 కోసం రిక్వెస్ట్ పెడితే జూన్ 2న రూ.3,000 వచ్చాయి. ఆ వెంటనే లోన్ తిరిగి చెల్లించాని మెసేజ్‌లు రావడం ప్రారంభమైంది. ఇంతలోనే నాకు నగ్నంగా ఉన్న ఓ వీడియోను పంపి నా ఫొటో ఎడిట్ చేశారు.. ఆ వీడియోను కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారికి పంపారు.. నాకు 14 మంది కాల్ చేసి ఇదేంటని అడిగారు’’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు వాపోయింది.