సంబరాల్లో ముంబై ఇండియన్స్ (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

సంబరాల్లో ముంబై ఇండియన్స్ (వీడియో)

May 14, 2019

హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొందిన ముంబై సంబరాలు చేసుకుంటుంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించిన తర్వాత హైదరాబాద్‌లో విజయోత్సవ సంబరాలు జరుపుకున్న జట్టు ఆటగాళ్లు..

సోమవారం రాత్రి ముంబైకి చేరుకున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆటగాళ్లను ఓపెన్ టాప్ బస్సులో ఊరేగించింది. ఈ ర్యాలీకి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇప్పటి వరకు మొత్తం నాలుగు ఐపీఎల్ ట్రోఫీలను  ముంబై అందుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.