కోల్‌కత్తాకు తప్పని కష్టాలు.. జోరుమీద ఉన్న ముంబై - MicTv.in - Telugu News
mictv telugu

కోల్‌కత్తాకు తప్పని కష్టాలు.. జోరుమీద ఉన్న ముంబై

October 17, 2020

ngvnfgn

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో కోల్‌కత్తాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆటగాళ్లలో దూకుడు తగ్గిపోవడంతో పరాజయాలను మాటగట్టుకోవాల్సి వస్తోంది. నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఓడిపోయింది. స్వల్ప లక్ష్యం మాత్రమే ఉండటంతో ముంబై ఆటగాళ్లు సులువుగా చేధించారు. దీంతో 19 బంతులు మిగిలి ఉండగానే గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.

మొదటగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. మోర్గాన్ 29 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఆ రత్వాత 149 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన ముంబై ఆటగాళ్లు మొదటి నుంచే దీటుగా ఆడారు. 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, క్వింటన్ డికాక్‌లు శుభారంభాన్ని ఇచ్చారు. డికాక్ 44 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఆ తర్వాత వెనుదిరగాల్సి వచ్చింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన క్వింటన్ డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.