ముంబై విడిచేది లేదని పదవినే వదులుకున్న న్యాయమూర్తి  - MicTv.in - Telugu News
mictv telugu

ముంబై విడిచేది లేదని పదవినే వదులుకున్న న్యాయమూర్తి 

February 15, 2020

Justice Dharmadhikari Resign

ఎవరికైనా తమ ఉద్యోగమంలో ప్రమోషన్ వచ్చి మరో చోట కీలక పదవి ఇస్తామంటే ఎగిరి గంతేస్తారు. వెంటనే అక్కడికి రెక్కలు కట్టుకొని వాలిపోతారు. కానీ బొంబాయి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి సత్యరంజన్ ధర్మాదికారి మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు. తనకు పదోన్నతి, బదిలీ రెండూ వద్దని చెబుతూ ఉన్న పదవికి కూడా రాజీనామా చేశారు. తాను ముంబైని వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు. 

సత్యరంజన్ ధర్మాదికారికి ఇటీవల మరో రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేశారు. కానీ తనకు కుటుంబ పరమైన కారణాల వల్ల తాను మరో ప్రాంతానికి బదిలీపై వెళ్లలేనని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు అంగీకరించకపోవడంతో చివరకు తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు పంపించారు. ముంబైని వీడేందుకు తాను సిద్ధంగా లేనని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బొంబాయి హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదంటూ ఆరోపించారు. కాగా బొంబాయి హైకోర్టు జడ్జిగా 2003లో ధర్మాధికారి నియమితులయ్యారు.