కొన్ని క్షణాలు ఆలస్యమై ఉంటే.. షాకింగ్ వీడియో  - MicTv.in - Telugu News
mictv telugu

కొన్ని క్షణాలు ఆలస్యమై ఉంటే.. షాకింగ్ వీడియో 

August 4, 2020

 Mumbai Landslide on Western Express Highway in Kandivali.

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెతుత్తున్నాయి. ముంబై నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. పలు చోట్లు కొండచరియలు విరిగిపడుతున్నాయి. థానే, పాల్ఘర్, రాయ్‌గడ్ జిల్లాల్లో వందల మంది గూడు కొల్పోయి సాయం కోసం అర్థిస్తున్నారు. కమూనికేషన్ వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. 

ఈ రోజు కాండవిలీలో వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. తెల్లవారుజామున కొన్ని వాహనాలు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో కొన్ని వాహనాలు అక్కడే ఉన్నాయి. వెనుక వైపున్న భారీ కొండచరియ క్షణాల్లో పేకమేడలా కుప్పకూలింది. అక్కడి వారు వెంటనే పరుగులు తీశాయి. అయితే కొన్ని వాహనాలు అప్పటికే మట్టిలో కూరుకుపోయాయి. దీంతో కొన్ని గంటల పాటు రాకపోకలకు ఇబ్బంది కలిగింది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతవరణ శాఖ హెచ్చరించింది.