లోకల్ రైల్లో..  అందరూ చూస్తుండగానే.. - MicTv.in - Telugu News
mictv telugu

లోకల్ రైల్లో..  అందరూ చూస్తుండగానే..

April 6, 2018

ముంబై లోకల్ రైల్లో ఘోరం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి ఒక మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమెను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. గురువారం రాత్రి థానే నుంచి ఛత్రపతి శివారా టెర్మినస్  వెళ్తున్న రైల్లోని వికలాంగుల బోగీలో ఈ ఘటన జరిగింది. రైల్లోని ప్రయాణికులు ఆ ఆగడాలను మౌనప్రేక్షకుల్లా చూస్తుండిపోయారేగాని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

బాధితురాలు ఎంత ప్రతిఘటించినా దుండగుడు ఆమెను వదల్లేదు. తలుపు దగ్గరికి కూడా లాక్కెళ్లాడు. బోగీలో ఉన్న ఒక పోలీసు, మరికొందరు అలారం మోగించారు. అయితే గ్రిల్ అడ్డుగా ఉండడంతో వారు ఆమెను కాపాడలేకపోయారు. తర్వాత కొందరు ప్రయాణికులు దాదార్ పోలీసుకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు రషీక్‌ షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు, దాడి చేసి వ్యక్తి పరిచయస్తులేనని, ఆమెకు అతడు పెద్ద మొత్తంలో బాకీ ఉన్నాడని తేలింది. డబ్బు విషయం ప్రస్తావించడంతో ఆమెపై దాడికి యత్నించాడని పోలీసులు తెలిపారు.