బయటికెళ్లాడని తమ్ముణ్ణి చంపిన అన్న - MicTv.in - Telugu News
mictv telugu

బయటికెళ్లాడని తమ్ముణ్ణి చంపిన అన్న

March 27, 2020

Mumbai Man attacks on Brother For Leaving Home During Lockdown.

కరోనా వైరస్‌ను అరికట్టడానికి కేంద్రప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో లాక్‌డౌన్ సమయంలో ఎవరైనా ఇంటి బయటి నుంచి వస్తే లోపలి రానివ్వడం లేదు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ సమయంలో బయటకు వెళ్లిన తమ్ముణ్ణి స్వంత అన్నే హత్య చేశాడు. ఈ ఘోరం ముంబైలోని కందివాలిలో జరిగింది.  

రాజేష్‌ లక్ష్మి ఠాకూర్‌, దుర్గేష్ అన్నదమ్ములు. దుర్గేష్‌ పుణేలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అతడు ఇంటికి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం​ కిరాణ సామాను తీసుకరావడానికి బయటకు వెళ్లి రాత్రిపూట ఇంటికి వచ్చాడు. దీంతో దుర్గేష్‌పై రాజేష్‌, అతని భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పుడు బయటకు ఎందుకు వెళ్లావని ప్రశ్నించారు. దీంతో రాజేష్‌కు, దుర్గేష్‌కు మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత రాజేష్‌ కిచెన్‌లోకి వెళ్లి కత్తి తీసుకొని వచ్చి దుర్గేష్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో దుర్గేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో పోలీసులు రాజేష్‌పై హత్య కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు.