Mumbai Ranji team world record .. win over 725 runs with Uttarakhand
mictv telugu

ముంబై రంజీ టీం వరల్డ్ రికార్డు.. ఏకంగా 725 పరుగులతో

June 9, 2022

Mumbai Ranji team world record .. win over 725 runs with Uttarakhand

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ముంబై జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. ఉత్తరాఖండ్ జట్టుపై గురువారం ఏకంగా 725 పరుగుల తేడాతో గెలిచి గత రికార్డులను తిరగరాసింది. ఇంతకుముందు అత్యధిక పరుగులతో గెలిచిన రికార్డు న్యూసౌత్ వేల్స్ జట్టు పేరిట ఉండేది. దాదాపు శతాబ్దం క్రితం 1929/30లో క్వీన్స్ లాండ్ జట్టుపై 685 పరుగుల తేడాతో గెలిచిన రికార్డే ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు ముంబై జట్టు దానిని అధిగమించింది.

ఇన్నింగ్స్‌ల వారీగా చూస్తే మొదట బ్యాటింగ్ చేసిన పృథ్వీషా నేతృత్వంలోని ముంబై జట్టు 8 వికెట్లు కోల్పోయి 647 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగుకి దిగిన ఉత్తరాఖండ్ టీం 114 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్ షామ్స్ ములాని 5 వికెట్లతో చెలరేగిపోయాడు. భారీ ఆధిక్యం దక్కినా ముంబై ఉత్తరాఖండ్‌ని ఫాలోఆన్ ఆడించకుండా బ్యాటింగుకి దిగింది. ఈ సారి యశస్వి జైశ్వాల్ సెంచరీతో మూడు వికెట్ల నష్టానికి 261 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం రెండోసారి బ్యాటింగుకి దిగిన ఉత్తరాఖండ్ జట్టు కేవలం 69 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది. దీంతో రికార్డు స్థాయిలో విజయం ముంబై జట్టును వరించింది.