ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. 100 నగరాల లిస్ట్ లో భారతదేశం నుంచి కేవలం ముంబై మాత్రం నిలిచింది. ఈ నగరం 73వ స్థానంలో ఉంది.
అత్యుత్తమ నగరాల ర్యాంకింగ్స్ ప్రపంచంలోని 250 కంటే ఎక్కువ నగరాల పనితీరును బెంచ్ మార్క్ చేస్తుంది. ఈ ప్రాంతాలు నివసించడానిక, సందర్శించడానికి, పెట్టుబడి పెట్టడానికి టాప్ 100 స్థలాలను గుర్తిస్తారు. దాని ఆధారంగా 2023 సంవత్సరంలో ప్రపంచంలోనే నంబర్ వన్ గా లండన్ నిలిచింది.
రెసొనెన్స్ కన్సల్టెన్సీ రూపొందించిన ప్రపంచంలోని ఉత్తమ నగరాల నివేదిక మిలియన్ కంటే ఎక్కువ జనాభాతో ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలకు ర్యాంక్ ఇచ్చింది. అంతేకాదు.. ఉపాధి, పెట్టుబడి, పర్యాటకం, సందర్శకులు వంటి వివిధ పారామితులపై నగరాల పనితీరు విశ్లేషించి నగరాల ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. 11 మిలియన్లకు పైగా జనాభా కలిగిన అద్భుతమైన ఇంగ్లీషు నగరం లండన్. దీంతో పాటు టోక్యో, న్యూయార్క్, పారిస్, దుబాబ్, స్పెయిన్ ర్యాంకింగ్లో టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో 73 వ స్థానంలో ముంబై నగరం ఉంది.
టాప్ 10 నగరాలు..
1. లండన్, ఇంగ్లాండ్
2. పారిస్, ఫ్రాన్స్
3. న్యూయార్క్ నగరం, యూఎస్ఏ
4. టోక్యో, జపాన్
5. దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
6. బార్సిలోనా, స్పెయిన్
7. రోమ్, ఇటలీ
8. మాడ్రిడ్, స్పెయిన్
9. సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్
10. ఆమ్ట్సర్డ్యామ్, నెదర్లాండ్స్
ముంబై గురించి..
రెసొనెన్స్ కన్సెల్టెన్సీ రూపొందించిన అత్యుత్తమ నగరాల్లో మహారాష్ట్ర రాజధాని ముంబై 73వ స్థానంలో నిలిచింది. ‘మయానాగ్రి’గా ప్రసిద్ధి చెందిన ముంబై కలల నగరంగా కీర్తించబడుతుంది. అంతేకాదు.. భారతదేశ ఆర్థిక రాజధానిగా కూడా ఉంది. దాదాపు 17 మిలియన్ల ముంబై వాసులకు నిలయం. ఈ నగరం ప్రపంచంలోనే అతిపెద్ద స్థానిక రైలు నెట్ వర్క్ల్లో ఒకటి. గేట్ వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, జుహూ బీచ్, హ్యాంగింగ్ గార్డెన్స్ మరెన్నో పర్యాటక ఆకర్షణలను కలిగి ఉంది.