గోడ దూకి రన్ వే పైకొచ్చి వ్యక్తి హల్‌చల్ (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

గోడ దూకి రన్ వే పైకొచ్చి వ్యక్తి హల్‌చల్ (వీడియో)

August 23, 2019

ఎయిర్‌పోర్టు అంటే బస్టాండో, రైల్వే స్టేషనో అనుకున్నట్టున్నాడు. ఎంచక్కా సెక్యూరిటీ వాళ్ల కన్నుగప్పి రన్ వే పైకి వెళ్లాడు ఓ వ్యక్తి. అక్కడంతా తాపీగా తిరుగుతూ అంతా పరిశీలించసాగాడు. ఇంతలో అతన్ని ఓ పైలట్ వెంటనే ఇంజిన్ ఆపేసి భద్రతా సిబ్బందికి ఫోన్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన భద్రతా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనికి మతిస్థిమితం లేకే గోడ దూకి విమానాశ్రయంలోకి వచ్చాడని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 

ఈ ఘటన ముంబయి ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది.  స్పైస్‌జెట్‌ సంస్థకు చెందిన ఓ విమానం ముంబయి నుంచి బెంగళూరు బయలుదేరేందుకు సిద్దంగా ఉంది. ఇంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా రన్ వేపై సంచరిస్తున్నాడు. ఎంచక్కా అతను రన్ వేపై షికారు కొట్టాడు. విమానాన్ని పరిశీలించాడు. అతన్ని గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేసి భద్రతా అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన భద్రతా అధికారులు అతన్ని పట్టుకున్నారు. అతన్ని విచారించగా తలాతోక లేని సమాధానాలు చెప్పసాగాడు. దీంతో అతని మానసిక పరిస్థితి బాగాలేదని.. అందుకే అతను గోడదూకి రన్ వే పైకి వచ్చాడని భద్రతా అధికారులు స్పష్టం చేశారు.

అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌ నటి గుల్‌ పనాగ్‌ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చూసింది. ‘అతడు ఎలా లోపలికి వచ్చాడు..? గుర్తు తెలియని వ్యక్తి లోపలికి వస్తుంటే విమానాశ్రయ సిబ్బంది ఏం చేస్తున్నారు..? ఇంజిన్‌కు చాలా దగ్గరగా వెళ్లాడు. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను’ అంటూ పోస్టు చేసింది. దీనిపై ఎయిర్ పోర్టు సిబ్బంది స్పందించింది. ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని.. గోడ దూకి లోపలికి వచ్చినట్లు గుర్తించామని తెలిపారు. ఇది గమనించిన పైలట్లు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా విమానం ఇంజిన్‌ను ఆపేశారని చెప్పారు.  ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పేర్కొన్నారు.