ఐపీఎల్‌లో మెరిసిన ముంబై.. పంజాబ్ చిత్తు - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్‌లో మెరిసిన ముంబై.. పంజాబ్ చిత్తు

October 2, 2020

Mumbai VS Kings XI Punjab Match

ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. స్టేడియంలో ఆటగాళ్లు పరుగుల వరదను పారిస్తున్నారు. నిన్న ముంబై, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. 48 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకుంది. ముంబై బౌలర్ల ముందు పంజాబ్ బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోతుండడంతో పరాజయం ఖాయమైంది. దీంతో పాయింట్ల పట్టికలో ముందు వరుసలోకి  చేరిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (70)  పరుగులు చేసి మంచి స్కోర్‌ను సాధించాడు. 

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి వచ్చిన పంజాబ్ ఏ దశలోనూ దూకుడుగా ఆడలేదు. ఆది నుంచే తడబాటు మొదలైంది.  చివరకు 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. దీంతో 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో జేమ్స్ పాటిన్సన్, బుమ్రా, రాహుల్ చాహర్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. పొలార్డ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.