కుక్క కోసం..తల్లిపై కేసుపెట్టిన కూతురు - MicTv.in - Telugu News
mictv telugu

కుక్క కోసం..తల్లిపై కేసుపెట్టిన కూతురు

November 9, 2019

పెంపుడు కుక్క విషయంలో తల్లిపై కూతురు కేసుపెట్టిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. జంతు ప్రేమికురాలైన కూతురు వీధి కుక్కను పెంచుకోవడానికి తెచ్చుకుంది. అది నచ్చని తల్లి ఒక రోజు ఆ కుక్కను ఇంటి నుంచి తరిమేసింది. ఈ విషయం తెలియక ఆ కూతురు ఎక్కడెక్కతో వెతికినా ఫలితం లేకుండా పోయింది. చివరికి అసలు విషయం తెలిసి కన్నతల్లిపై కేసు పెట్టింది.

dog

పంత్ నగర్‌లో ఉంటున్న స్నేహ నికమ్ కొన్ని నెలల క్రితం ఓ కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకుంది. దానికి ‘కుకీస్’ అని ముద్దుగా పేరు పెట్టుకుంది. గత సెప్టెంబర్‌లో ఆ కుక్క పిల్లను ఇంటి గేట్ దగ్గర కట్టేసింది. స్నేహ కొద్దిసేపటి తర్వాత వచ్చి చూస్తే అది అక్కడ కనపడలేదు. ఈ విషయమై తల్లిని అడగ్గా.. ఇప్పుడే విడిచిపెట్టానని చెప్పింది. దీంతో స్నేహ బయటకు వెళ్లి చూసింది. స్నేహాకు ఆ కుక్క ఎక్కడా కానరాలేదు. దీంతో ఇంటికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూసింది. అందులో స్నేహ తల్లి స్వయంగా కుక్కను బయటకు తీసుకెళ్లి వదిలేసి దృశ్యాలను చూసి షాకైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుక్క ఆచూకీ తెలియలేదు. దీంతో స్నేహ తన ఫ్రెండ్ సాయంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జంతు సంరక్షణ చట్టాల ప్రకారం స్నేహ తల్లిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను ప్రశ్నిస్తున్నారు.