సిద్ధివినాయకుడికి బంగారు పైకప్పు, తలుపులు.. - MicTv.in - Telugu News
mictv telugu

సిద్ధివినాయకుడికి బంగారు పైకప్పు, తలుపులు..

January 21, 2020

Siddhivinayak.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం ఎంత ప్రసిద్ధో చెప్పాల్సిన అవసరం లేదు. అనిల్ అంబానీ, అమితాబ్ బచ్చన్ వంటి కుబేరులు ముఖ్యమైన పనులును, శుభకార్యాలకు ఆ ఆలయంలో పూజ చేశాకే ప్రారంభిస్తారు. గుడికి విలువైన కానుకలు కూడా సమర్పిస్తుంటారు. తాజాగా  ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు భారీ ఎత్తున బంగారాన్ని కానుకగా అందించాడు. ఆ బంగారంతో గణేశునికి సీలింగ్, డోర్‌లను రూపొందించారు. 

వీటిని తయారు చేసేందుకు 35 కిలోల బంగారాన్ని వినియోగించారు. దీని విలువ సుమారు రూ.14 కోట్లు ఉంటుందని అంచనా. గతవారం అందించిన ఈ కనుకల విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దాత వివరాలను వెల్లడించడానికి ఆలయ చైర్మన్ ఆదేశ్ బండేకర్ నిరాకరించారు. ఈ సిద్ధి వినాయక ఆలయం దేశంలోనే అత్యంత ధనిక ఆలయాలలో ఒకటిగా పేరుగాంచింది. ప్రతీయేటా ఈ ఆలయానికి కోట్ల రూపాయలు కానుకల రూపంలో వస్తుంటాయి. 2017వ సంవత్సరం వరకు ఈ ఆలయానికి 320 కోట్లు విలువ చేసే కానుకలు అందాయి.