మున్సిపల్‌ పోలింగ్ ప్రారంభం.. - MicTv.in - Telugu News
mictv telugu

మున్సిపల్‌ పోలింగ్ ప్రారంభం..

January 22, 2020

fghjmk

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ షురువైనది. రాష్ట్రవ్యాప్తంగా 120 మన్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 25న ఫలితాలు రానున్నాయి. పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 120 మున్సిపాలిటీల్లో 6,325 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే 9 కార్పొరేషన్లలో 1,586 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతోన్నాయి. 

ఈ ఎన్నికల కోసం తెలుపు రంగు పత్రాలను ఉపయోగిస్తున్నారు. దొంగ ఓట్లు వేయకుండా పోలింగ్ కేంద్రాల్లో ఫేస్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇలా చేయడం దేశంలోనే తొలి సారి కావడం విశేషం. పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం ఈ రోజు సెలవు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో 12 వేల మందికి పైగా అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 53,36,605.