‘ 26 ’ ఏళ్ళ తర్వాత రష్యాలో రిలీజ్ అవుతున్న హిందీ సినిమా ! - MicTv.in - Telugu News
mictv telugu

‘ 26 ’ ఏళ్ళ తర్వాత రష్యాలో రిలీజ్ అవుతున్న హిందీ సినిమా !

July 17, 2017

టైగర్ ష్రాఫ్ నటించిన ‘ మున్నా మైకేల్ ’ ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ? చాలా స్పెషలే వుంది మరి. ఎందుకంటే ఈ సినిమా రష్యాలో 26 ఏళ్ళ తర్వాత రిలీజవుతున్న బాలీవుడ్ సినిమాగా చరిత్ర సృష్ఠించనుందన్నమాట. అప్పుడెప్పుడో 1991 లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘ అజూబా ’ సినిమా అక్కడ విడుదలై హిట్టైంది. ఆ తర్వాత అక్కడ ఏ బాలీవుడ్ సినిమా రిలీజ్ అవలేదు. ఆ మధ్య రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా రూపొందించిన ‘ భాగ్ మిల్కా భాగ్ ’ సినిమాను అక్కడ రిలీజ్ చెయ్యాలని చాలా ట్రై చేసాడు గానీ వర్కౌట్ అవలేకపోయిందట.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రష్యాలో హిందీ సినిమా రిలీజవ్వటం ఎంతో గొప్ప విషయమని బాలీవుడ్ ఇండస్ట్రీ భావిస్తోంది. అయితే మైకేల్ జాక్సన్ పేరుతో వస్తున్న సినిమా అవడంతో అక్కడివారికి ఈ సినిమా మీద క్రేజు పెరిగిందని, మన ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కల్చరల్ ఆక్టివిటీస్ లో పాల్గొనడం కూడా ఒక కారణం అంటున్నారు. చూడాలి టైగర్ ష్రాఫ్ రష్యా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో..