ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్

November 3, 2022

munugode by election polling started on today at 7am

 

​గత నెల రోజులుగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్​ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ను ఆయా పోలింగ్‌ స్టేషన్లలో సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. అంతకు ముందు మాక్‌ పోలింగ్‌ను నిర్వహించారు. చాలాచోట్ల పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. నియోజకవర్గంలో 298 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా.. 2.41లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,21,720 మంది పురుష, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అన్ని పోలింగ్​ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాల నిఘాలో ఉప పోలింగ్‌ జరుగుతోంది.

 

munugode by election polling started on today at 7am

 

ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి BJP అభ్యర్థిగా బరిలో దిగారు. గతంలో గెలుపొంది 2018లో ఓటమి పాలైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరోమారు TRS తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి ఎన్నికల పోరులో నిలిచారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా శంకరాచారి, 10 మంది ఇతర పార్టీల అభ్యర్థులు, 33 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు.