Munugode By election: TRS, Congress Candidates casted their Vote
mictv telugu

ఓటేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు.. పూజలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి

November 3, 2022

రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక క్లైమాక్స్‌కి చేరింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వాద్ద బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున పాల్వాయి స్రవంతి అభ్యర్థులుగా ఉన్నారు.

నియోజకవర్గంలోని ఇడికూడలో కాంగ్రెస్‌ అభ్యర్థి స్రవంతి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గత రెండు నెలలుగా జోరుగా ప్రచారం చేసిన ఆమె.. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కలిసి వచ్చి ఓటేశారు. టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లింగంవారిగూడెంలో ఓటేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మునుగోడు కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంది. ఓటేసే ముందు ఆయన స్థానిక శివాలయంలో సతీసమేతంగా పూజలు నిర్వహించారు.

kpr

పార్టీ గుర్తుతో పోలింగ్ కేంద్రంలోకి కేఏ పాల్:
ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మునుగోడు ఇండిపెండెంట్ అభ్యర్థి కేఏ పాల్ కలకలం రేపారు. 10 వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని వచ్చిన కేఏ పాల్.. పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళం సృష్టించారు. ఉంగరం గుర్తుతోనే పోటీలో ఉండడంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో తనదే గెలుపు అని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తన గెలుపును అడ్డుకోలేరని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ తనపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు.