Munugode by poll counting: BJP lead in fourth round
mictv telugu

టీఆర్ఎస్ మంత్రులు ఇంఛార్జులుగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ముందంజ

November 6, 2022

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మునుగోడులో రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యం మారుతుంది. టీఆర్ఎస్ మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇంచార్జ్‌లుగా ఉన్న గ్రామాల్లో, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జ్ ఉన్న లింగోజిగుడెం గ్రామంలో నాలుగు వందలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది బీజేపీ. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్ఎస్‌ తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తొలి రౌండ్‌లో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా , వరుసగా 2,3,4 రౌండ్లలో బీజేపీ లీడ్‌లో ఉంది. మూడో రౌండ్ లో టీఆర్ఎస్ 7010, బీజేపీ 7426, కాంగ్రెస్ 1532 ఓట్లు వచ్చాయి. ఇక తొలి రౌండ్లో ప్రజా శాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్‌కు 34 ఓట్లు రాగా, నోటాకు 29 ఓట్లు వచ్చాయి.