మునుగోడు బైపోల్: తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌దే ఆధిక్యం
మునుగోడు ఉపఎన్నిక తొలి ఫలితం విడుదలైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా.. ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ ఆ పార్టీనే లీడ్‌లో ఉంది. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ 1,352 ఓట్ల ఆధిక్యంలో ఉంది.మునుగోడు ఉపఎన్నిక తొలి ఫలితం విడుదలైంది. మొత్తం 14, 553 ఓట్ల కౌంటింగ్ లో టీఆర్ఎస్‌కు 6,478ఓట్లు , బీజేపికి 5,126, కాంగ్రెస్‌కు 2,100 ఓట్లు, ఇతరులకు 1676 ఓట్లు పోలయ్యాయి. తొలి పోలింగ్ కేంద్రం చౌటప్పల్ మండలంలోని జైకేసారంలోని తొలి బూత్‌లో కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 3 పోలింగ్ బూత్ లు ఉండగా తొలి బూత్‌లో టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. ఇక 686 పోస్టల్ బ్యాలట్ ఓట్లను లెక్కించగా.. టీఆర్ఎస్ ముందంజలో ఉంది. మొత్తం ఓట్లలో టీఆర్ఎస్‌కు 228 ఓట్లు రాగా.. బీజేపీకి 224 ఓట్లు వచ్చాయి. 4 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ఆధీక్యంలో ఉంది.
ప్రస్తుతం చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు మండలాల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. ఆ తర్వాత గట్టుప్పల్ , చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల ఓట్ల లెక్కింపు చేయనున్నారు అధికారులు. మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం వుంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్ స్టేషన్‌లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు.