Munugode by poll Counting: Revanth Reddy will respond to the Election Results
mictv telugu

మునుగోడు ఫలితాలపై అప్పుడే స్పందిస్తా.. రేవంత్ రెడ్డి

November 6, 2022

కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టిన రేపటితో ముగుస్తోంది. ముగింపు సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు మేనూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా యాత్రలో పాల్గొనడం నాకు దేవుడిచ్చిన వరమని అన్నారు. భారత్ జోడో యాత్ర గత నెల 23న తెలంగాణలో ప్రవేశించిందని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భరోసానిస్తూ యాత్ర సాగుతోందన్నారు. వివిధ వర్గాలు వారి సమస్యలు రాహుల్ కు వివరిస్తున్నారని, ప్రభుత్వాలు పరిష్కరించని సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు. 80 ఏళ్ల వృద్ధులు కూడా రాహుల్ గాంధీతో యాత్రలో పాల్గొంటున్నారని, దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలకు రాహుల్ పరిష్కరిస్తారని జనం నమ్ముతున్నారని చెప్పారు.

“దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ప్రధాని మోడీ ఈ ఎనిమిదేళ్లలో దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ చరిత్ర పుటల్లో దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం చేశారు. వారి స్ఫూర్తితో రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ఈ దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. భవిష్యత్ లో భారత్ జోడో యాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌ది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అవినీతితో కుళ్లి, కృశించి పోయింది. ఎవరెలాంటి సమస్యలు సృష్టించినా తెలంగాణ ప్రజలు రాహుల్ యాత్రను విజయవంతం చేశారు. ఈడీ, సీబీఐ దాడులు చేసినా, రాహుల్ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా రాహుల్ వెనకడుగు వేయలేదు.

ప్రజలు రాహుల్‌లో ఒక గొప్ప నాయకున్ని చూస్తున్నారు. దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా రాహుల్ సిద్ధంగా ఉన్నారు. జోడో యాత్రకు మద్దతుగా వీడ్కోలు పలికేందుకు రేపు మేనూరులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. జెండాలు, ఎజెండాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలకు అతీతంగా యాత్రకు మద్దతు తెలపాలి. రేపు పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం కదలి వచ్చి మెనూరులో సాయంత్రం 4గంటలకు జరిగే కృతజ్ఞత సభ ను విజయవంతం చేయాలి.సమాజహితం కోసం మీడియా మిత్రులు కూడా రాహుల్ పాదయాత్రలో కదం కదం కలపండి.రాజకీయ నాయకుల ముసుగులో దాడులకు పాల్పడుతున్న మోదీ, కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాలి” అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక మునుగోడు ఉపఎన్నిక గురించి చెబుతూ పూర్తి ఫలితాలు వచ్చాకే.. స్పందిస్తానని చెప్పారు.