Munugode by poll counting: TRS lead by 1034 votes at the end of four rounds
mictv telugu

4 రౌండ్‌లు పూర్తయ్యే సరికి లీడింగ్‌లో ఉన్నదెవరంటే..

November 6, 2022

Munugode by poll counting: TRS lead by 1034 votes at the end of four rounds

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నెల రోజుల ఉత్కంఠకు నేడు తెర పడనుంది. ఉప ఎన్నికలో తమదే విజయమని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ మొత్తం నాలుగు రౌండ్లు కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థికి 26343, బీజేపీ అభ్యర్థికి 25730, కాంగ్రెస్ అభ్యర్థికి 8200, ఇతరులకు మొత్తం 907 ఓట్లు వచ్చాయి. నాల్గవ రౌండ్ టీఆర్ఎస్ 1034 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. ఇక 4 వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 4854, బీజేపీకి 4555 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు.