Munugode By poll Voting : 25.8 percent voting till 11 am
mictv telugu

జోరందుకున్న పోలింగ్.. 11 గం. వరకు నమోదైన ఓటింగ్ శాతమిదే

November 3, 2022

చెదురుమదురు ఘటనలు మినహా మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులుతీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పోలింగ్‌ కేంద్రం వద్ద పహారా కాస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇదిలా ఉండగా.. మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలోని 294వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం కాసేపు మొరాయించింది. నాంపల్లితో పాటు ఒకట్రెండు కేంద్రాల్లో ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. సిబ్బంది వెంటనే ఈవీఎంలను సరిచేసి పోలింగ్‌ కొనసాగిస్తున్నారు.