Munugode By Poll voting ended peacefully
mictv telugu

మునుపెన్నడూ లేని విధంగా మునుగోడులో భారీ పోలింగ్

November 4, 2022

Munugode By Poll voting ended peacefully

రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపిన మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం కాస్త మందకొడిగా మొదలైన పోలింగ్.. ఆ తర్వాత క్రమంగా ఊపందుకుంది. చివరి గంటలో ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ముగిసినప్పటికి.. ఆ సమయానికి క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. అందువల్ల చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగా ముగిసింది. కొన్ని పోలింగ్ బూత్‌లలో రాత్రి పదిన్నర గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఓటర్లు.. తమ ఎమ్మెల్యే ఎవరో తేల్చేందుకు ఈసారి కాస్త ఆసక్తి ఎక్కువ చూపారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 93.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మునుగోడులో గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. 2004 ఎన్నికల్లో మునుగోడులో 87.31% పోలింగ్ శాతం నమోదయింది. 2009 లో 77.15%, 2014 లో 82.15%, 2018 లో 91.31% శాతం ఓట్లు పడ్డాయి. గత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ.. ఈసారి భారీ ఎత్తున పోలింగ్ నమోదు కావడం విశేషం. ఆదివారం ఈ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.