వంటమనిషిగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

వంటమనిషిగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

October 19, 2022

Munugode Bypoll Campaign: Malkajgiri Mla Mynampally Hanumantha Rao Became A Cook

తెలంగాణలో ఉత్కంఠభరితంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణలు పూర్తి కావడంతో ఇక కీలకమైన పోలింగ్ ఒక్కటే మిగిలింది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్ష కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ విశ్వప్రయత్నాలు చేస్తోన్నాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం ఈ మూడు ప్రధాన పార్టీలు ఇప్పటికే భారీ సంఖ్యలో నేతలను మునుగోడులో దింపేశాయి. ఎక్కడికక్కడ సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ఆయా పార్టీలు దూసుకుపోతున్నాయి. పోలింగ్‌కు ఇంకా కొన్నిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ఆయా పార్టీల నేతలు.. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు కొంతమంది నేతలు చిత్ర విచిత్రాలు చేస్తున్నారు.

తాజాగా మల్కాజ్‌గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఓటర్లను ఆకర్షించేందుకు వంటమనిషిగా మారిపోయారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలో టీఆర్ఎస్ ఎన్నికల సభ నిర్వహించింది. ఈ సభకు హాజరయ్యే కార్యకర్తలు, అభిమానులు, ప్రజల కోసం టీఆర్ఎస్ నేతలు భోజన ఏర్పాటు కూడా చేశారు. ఈ సందర్భంగా హన్మంతరావు స్వయంగా గరిట పట్టుకుని కాసేపు వంట పనిచేయడం అక్కడ ఉన్నవారిని ఆకర్షించింది. ఆయన వంటమనిషి అవతారమెత్తడం చూసి అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

 

,