Munugode Bypoll,Caste Wise,Voters, Ec
mictv telugu

క్యాస్ట్ పాలిటిక్స్..ఎవరికి మైలేజ్…

November 2, 2022

Munugode Bypoll,Caste Wise,Voters, Ec

కులానికో లెక్కుంది. ఆ లెక్కలే ఫలితాన్ని డిసైడ్ చేయబోతున్నాయి.ప్రధానంగా ఆ మూడు కులాలే మునుగోడులో గెలుపు ఎవరిదో తేల్చబోతున్నాయి. ఏ కులానికి ఎన్ని ఉన్నాయి? క్యాస్ట్ ఈక్వేషన్స్ కలిసి వచ్చేదెవరికి?మునుగోడులో మునిగేదెవరు?తేలేదెవరు?

కులాల వారీగా ఓట్ల లెక్కలు

మునుగోడులో మొత్తం 2లక్షల 41 వేల 855 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు లక్షా 21 వేల 662 మంది, మహిళలు లక్షా 20వేల 126 మంది ఉన్నారు. అందులో కొత్త ఓటర్లు 25 వేల మంది. వీరిని మినహాయిస్తే 2 లక్షల 20 వేల 5 వందల మంది. కులాల వారీగా లెక్కలు చూద్దాం. మునుగోడులో గౌడ కులస్తులదే అగ్రస్థానం. మొత్తం 35వేల 150 మంది ఓట్లు ఉన్నాయి 15.94శాతం ఓటు షేర్. ఆ తర్వాత స్థానం ముదిరాజులది 33 వేల 9వందల మంది ఓటర్లున్నారు. ముదిరాజ్‌ల ఓట్లు 15.37 శాతం. మూడో స్థానంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గం ఉంది. ఎస్సీ మాదిగ ఓటర్లు 25 వేల 6 వందల 50 మంది ఉన్నారు. వీరి ఓటు శాతం 11.63. యాదవులు 21 వేల 3 వందల 60 మంది ఉన్నారు. వీరి ఓటు శాతం 9.69. వీరి తర్వాత పద్మశాలీలు 11 వేల 6 వందల 80 మంది ఉన్నారు. వీరి ఓటు శాతం 5.30. ఇక ఎస్టీలు 10 వేల 5 వందల 20 మంది ఉన్నారు. వారి ఓటు శాతం4.7 శాతం

మిగతా కమ్యూనిటీ ఓట్లు

ఇక కుమ్మరి కమ్యూనిటీలో7,850 మంది ఓటర్లు, ఇక ఎస్సీ మాల 10,350 మంది ఓటర్లు, వడ్డెర కమ్యూనిటీ చెందిన8,350 ఓటర్లు, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీలో 7,820 ఓటర్లు, రెడ్డి కమ్యూనిటీలో7,690 మంది ఓటర్లు, ముస్లింలు7,650 మంది, కమ్మ 5,680 మంది, ఆర్య వైశ్య కమ్యూనిటీ ఓటర్లు 3,760 మంది, వెలమ ఓటర్లు 2,360 మంది, మున్నూరు కాపు ఓటర్లు 2,350 మంది, ఇతరులు 18,400 మంది ఉన్నారు.

ఆ నాలుగు కులాల చేతుల్లోనే…

మునుగోడులో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ నాలుగు సామాజిక వర్గాలే. ఎక్కువ ఓట్లు వీరి చేతుల్లో ఉన్నాయి. గౌడ, ముదిరాజ్ , ఎస్సీ మాదిగ, యాదవ కమ్యూనిటీలు గెలుపుని నిర్ణయించబోతున్నాయి. అందుకే ఈ కులాలపై ఎక్కువగా పార్టీలు దృష్టి పెట్టాయి. పోల్ మేనేజ్మెంట్‌లో ఈ ఓట్లపైనే నజర్ పెట్టాయి. ప్రధానంగా గౌడ, ముదిరాజ్‌లు 15 శాతం చొప్పున ఓట్ షేరింగ్ ఉంది. అందుకే నెల క్రితం నుంచే బ్లూ ప్రింట్ తయారీ చేసి టీఆర్ఎస్, బీజేపీ ఓట్ల వేట కొనసాగించాయి.