Munugode Effect..CONG Serious Action Plan On Komatireddy venkatreddy
mictv telugu

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై వేటు తప్పదా?

November 4, 2022

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పై కాంగ్రెస్ హైకమాండ్ వేటు వేయబోతుందా? సీరియస్ యాక్షన్ ప్లాన్‌కు సిద్ధమైందా? సీల్డ్ కవర్‌లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జవాబు ఇచ్చినా మరోసారి షోకాజ్ నోటీసులు దేనికి సంకేతం..అసలు కాంగ్రెస్ ఏం చేయబోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీని వదులకోవడానికి రెడీగా ఉందా?

మళ్లీ షోకాజ్

మునుగోడు వార్ ముగిసింది. ఉప ఎన్నికలో హ్యాండిచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ రెండోసారి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పార్టీ రూల్స్ ఉల్లంఘణపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే ఈ నోటీసులు తనకు అందలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు.

జరిగింది ఇది…

మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. కాబోయే పీసీసీ చీఫ్ తానేనని,,మిమ్ముల్ని బాగా చూసుకుంటాని హామీ ఇచ్చారు. ఈ ఆడియో మునుగోడు ప్రచారంలో కలకలం రేపింది. ఇష్యూని సీరియస్ గా తీసుకున్న టీకాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు.సీరియస్‌గా స్పందించిన హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇఛ్చింది.

కోమటిరెడ్డి వివరణ

ఈ షోకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆ వాయిస్ తనది కాదని స్పష్టం చేశారు. ఎవరో కావాలనే మార్ఫింగ్ చేశారని సీల్డ్ కవర్ లో హైకమాండ్ కు సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఎన్ ఎస్ యూఐ విద్యార్థి విభాగం నుంచి ననిచేస్తున్నానని పేర్కొన్నట్లు సమాచారం.

ఈసారి సీరియస్ యాక్షన్

మునుగోడు పోలింగ్ ముగిసిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు స్పందించకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మొత్తానికి ఆయనపై వేటేసినా, వేయకపోయినా ఎటొచ్చి కాంగ్రెస్‌కే నష్టం.