Munugode munugodu byelections 10th round results trs lead on bjp
mictv telugu

మునుగోడు 10వ రౌండ్.. గెలుపు టీఆర్‌ఎస్‌దే!

November 6, 2022

మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. పదో రౌండ్ ఫలితాలు వచ్చే సమయానికి కేసీఆర్ దళం 4416 ఓట్ల ఆధిక్యం సంపాదించింది. ఈ రౌండులో పార్టీకి 484 ఆధిక్యం దక్కగా మొత్తం ఓట్ల సంఖ్య 67339కి చేరింది. 10వ రౌండులో గులాబీకి 7499 ఓట్లు కమలానికి 7015 ఓట్లు తగ్గాయి. తాజా రౌండ్లలో టీఆర్ఎస్‌కు ఆధిక్యం కొంత తగ్గుతూ వచ్చినా మొత్తం ఆధిక్యం 5వేలకు చేరువ కావడంతో ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభార్ రెడ్డి విజయం ఖాయమని భావిస్తున్నాయి. అయితే ఇంకా ఐదు రౌండు మిగిలి ఉండడంతో ఫలితాలు తారుమారు కావొచ్చనే అంచనాలూ వస్తున్నాయి. కారును పోలిన రోటీ మేకర్ గుర్తుకు వెయ్యికిపైగా ఓట్లు రావడంతో గమనార్హం.

ఇక గత ఎన్నికల్లో 22వేలకుపైగా మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో దయనీయ స్థితికి చేరింది. ఆ పార్టీకి పదో రౌండుకు 14596 ఓట్లు పోలయ్యాయి. 1018 ఎన్నిల్లో కాంగ్రెస్‌గా అభ్యర్థిగా పోటీటి పడిన రాజగోపాల్ రెడ్డికి 97 వేలకుపైగా ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కోల్పోయిన ఓట్లను బీజేపీ, టీఆర్ఎస్ ఖాతాల్లో చెరోసగం పంచుకుంటున్నట్లు ఫలితాల సరళి చెబుతోంది.