Munugode postal ballot counting complete.. TRS in the lead!
mictv telugu

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి.. ముందంజలో టీఆర్ఎస్

November 6, 2022

ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం ప్రారంభమైంది.  మూడంచల భద్రత నడుమ ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటగా 686 పోస్టల్‌ బ్యాలట్ ఓట్లను లెక్కించగా.. టీఆర్ఎస్ ముందంజలో ఉంది. మొత్తం ఓట్లలో టీఆర్ఎస్‌కు 228 ఓట్లు రాగా.. బీజేపీకి 224 ఓట్లు వచ్చాయి. 4 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ఆధీక్యంలో ఉంది. ఆ తరువాత చౌటుప్పల్‌, నారాయణపురం, మునుగోడు మండలాల ఓట్ల లెక్కింపు మొదలైంది. అనంతరం గట్టుప్పల్‌ , చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఉదయం 9గంటలకు మొదటి రౌండ్‌ ఫలితం వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం వుంది.

ర్యాండమ్‌ గా 5 వీవీప్యాట్లలోని స్లిప్పులు లెక్కింపు ఉంటుంది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు, ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొదట చౌటుప్పల్‌ మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మొదలైంది. తమ భవితవ్యం ప్రత్యక్షంగా పరీక్షించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ముగ్గురు అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.