మునుగోడు దత్తతపై కీలక ట్వీట్ చేసిన కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

మునుగోడు దత్తతపై కీలక ట్వీట్ చేసిన కేటీఆర్

November 6, 2022

ktr

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన అనంతరం ట్విట్టర్‌లో స్పందిస్తూ ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీని గుర్తు చేసుకున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని, పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయడంపై దృష్టిసారిస్తానని తెలిపారు.

 

అంతకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. క్రితం కంటే పార్టీకి ఓట్ల శాతం పెరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. కారు గుర్తును పోలిన గుర్తులకు 6 వేల ఓట్లు పడ్డాయని, లేకపోతే మెజారిటీ ఇంకా పెరిగేదని అభిప్రాయపడ్డారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మెజారిటీని తగ్గించగలిగారే కానీ, గెలుపును అడ్డుకోలేకపోయారని పేర్కొన్నారు. కాగా, కేటీఆర్ తాజా ట్వీట్‌తో మునుగోడు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆయన నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు.