Munugodu assembly elections fifth round counting
mictv telugu

5వ రౌండులోనూ టీఆర్ఎస్‌దే పైచేయి..

November 6, 2022

రౌండు రౌండుకు మారుతున్న ఆధిక్యం, ఫలితాల్లో జాప్యంపై ఆరోపణలు మధ్య మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు మరింత ఉత్కంఠగా మారాయి. ఐదో రౌండు ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముందుకు దూసుకెళ్లారు. తన సమీప అభ్యర్థి కోమటిరెడ్డ రాజగోపాల్ రెడ్డి పై స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐదో రౌండుకల్లా ఆయనకు 1430 ఓట్ల ఆధిక్యం లభించింది. రెండవ, మూడవ రౌండ్ తప్ప మినహా మిగిలిన మూడు రౌండ్లలో గులాబీనే పైకి వెళ్లింది. 5వ రౌండులో టీఆర్ఎస్‌కు 32,405 ఓట్లు, బీజేపీకి 30,975 ఓట్లు, కాంగ్రెస్‌కు 10,055 ఓట్లు, బీఎస్పీకి 1,237 ఓట్లు దక్కాయి.