మునుగోడు కౌంటింగ్ అంతా సిద్ధం.. లెక్కింపు ఇలా.. - MicTv.in - Telugu News
mictv telugu

మునుగోడు కౌంటింగ్ అంతా సిద్ధం.. లెక్కింపు ఇలా..

November 5, 2022

Munugodu assembly elections

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం జరిగే లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సిబందికి అవసరమైన శిక్షణను పూర్తి చేశారు. శనివారం డమ్మీ ఈవీఎంలతో కౌంటింగ్ నిర్వహించగా సరైన ఫలితాలే వచ్చాయి. ఆదివారం మొత్తం 21 టేబుళ్లుపై 15 రౌండ్లను లెక్కిస్తారు. ఫలితం సరళి 10 గంటలకల్లా వెలువుడుతుందని భావిస్తున్నారు. మధ్యాహ్నానికి ఫలితం తెలిసిపోతుంది.

మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. నల్గొండలోని ఎఫ్సీఐ గిడ్డంగుల కార్యాయలంలో కౌంటింగ్ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఒక్కో రౌండులో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. 686 పోస్టల్ బ్యాలట్ ఓట్లను లెక్కించాక ఈవీఎంల లెక్కింపు ప్రారంభం అవుతుంది. తొలుత చౌటుప్పల్, తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పుల్ మండలాల ఓట్లు లెక్కిస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికలు అవసరమయ్యాయి. బీజేపీ తరఫున ఆయన, అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి తలపడుతున్నారు. ఈ నెల 3న పోలింగ్ జరిగింది. 47 మంది అభ్యర్ధులు పోటీ చేశారు.